సరళకథలు
Language

 

If there are any errors in the script or the narration, please send a note to contact@seva.gurukula.com

 

కథలు వినడం అంటే పిల్లలకు, పెద్దలకు ఎంతో ఇష్టం!  

 

చిన్ని చిన్ని నీతివంతమైన కథలను “సరళకథలు” అనే శీర్షికతో  అందించడం జరుగుతుంది. పిల్లలు ఈ కథలను చదువుకోవచ్చు, ఆడియో రూపంలో వినవచ్చు లేదా వీడియో రూపంలో చూడవచ్చు.

 

కథల ద్వారా పిల్లలు, జీవితం గురించి, ఈ ప్రపంచం గురించి మరియు వారి గురించి వారు ఎన్నో విషయాలను తెలుసుకుంటారు. అలాగే తమకు తాము ఆ పాత్రలలో లీనమై, వాటితో అనుబంధాన్ని ఏర్పర్చుకుంటూ నిజ జీవితంలో వారి ప్రవర్తనను సరిచూసుకుంటారు. 

 

పిల్లలు తమ తల్లితండ్రులతో కలిసి ఈ సరళకథలను వినడం ద్వారా, తమ భావాలను మరియు అనుభూతులను పెద్దలతో తేలికగా పంచుకోగలుగుతారు. మీరు మీ పిల్లలను కథ  లేదా కథలోని పాత్రల గురించి ప్రశ్నించడం వలన వారిలోని ఊహాశక్తి పెంపొందుతుంది.

 

పిల్లలకు తమ మాతృభాష, ఆంగ్లభాష మరియు సంస్కృతభాషలలోని పదములు, వాటి ప్రయోగాలను  నేర్చుకోవటానికి ఇది ఒక అధ్భుతమైన ప్రక్రియ.

 

మీకు తెలిసిన కథలను మాతో పంచుకోవాలి అనుకున్నా  లేదా వీటిని  వేరే భాషలలోనికి అనువదించాలి అనుకున్నా మాకు ఈమెయిల్ చేయండి. <contactgurukula@gmail.com>

 

ఈ కథలను తయారుచేసేటప్పుడు మాకు ఎటువంటి మధురానుభూతి కలిగిందో, అదే అనుభూతి మీరు కూడా పొందుతారు అని భావిస్తున్నాం.