నైమిశారణ్యంలో శౌనకుడు మొదలైన మహర్షులకు పురాణాలు చెప్పటంలో గొప్ప ప్రజ్ఞగల సూతుడు, భాగవతాన్ని వ్యాసమహర్షి రచించి తన కుమారుడైన శుకయోగీంద్రుని చేత చదివించాడు- అని చెప్పగా శౌనకుడు, “అయ్యా శుకునకు మోక్షం తప్ప మరేమీ అక్కరలేదే. అతడు దేనినీ పట్టించుకోడే. అట్టివాడు భాగవతాన్ని ఎందుకు అభ్యసించాడు” అని అడిగాడు. అప్పుడు సూతుడు ఇలా అన్నాడు