పోతన భాగవతం
Language
gurukula-audio-image
0.002.39
icon-rewindicon-playicon-forward
icon-volume

 

All content is owned and created by bhagavatamanimutyalu.org who have graciously made it available in the Gurukula platform

 

పద్యము

ఇమ్మనుజేశ్వరాధముల కిచ్చి పురంబులు వాహనంబులున్
సొమ్ములు గొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము వాసి కాలుచే
సమ్మెటపోటులం బడక సన్మతి శ్రీహరి కిచ్చి చెప్పె నీ
బమ్మెరపోతరాజొకడు భాగవతంబు జగద్ధితంబుగన్.

 

సందర్భం

తనకు పూర్వం కొందరు కవులు తమ సుఖభోగాలకోసం కావ్యాలను రాజులకు అంకితం పేరుతో అమ్ముకున్నారు. పోతనకు అది పరమనీచమైన పని అని అనిపించింది. అంతేకాదు, ఆ పాడుపనికి యముడు అతిఘెరంగా శిక్షిస్తాడనికూడా ఆయన మనస్సు చెబుతున్నది. తానా పాతకానికి ఒడిగట్టనని ప్రతిజ్ఞ చేస్తున్నాడు.

 

తాత్పర్యము

సాధారణంగా రాజ్యాలేలేవాళ్ళు నీచులై ఉంటారు. "చిన్ని నా పొట్టకు శ్రీరామరక్ష" అనే భావనతో బ్రదకటమే ఆనీచత్వం. కానీ తాము గొప్పవారుగా లెక్కకెక్కాలి అని కూడా వారి ఉబలాటం. దానికోసం కవులకు ఏదో విదిలిస్తూ కృతిభర్తలుగా కీర్తిపొందాలనే దాహం వారికి ఉంటుంది. ఈ బమ్మెరపోతరాజు అటువంటి రాజులు ఇచ్చే అగ్రహారాలనూ, ఏనుగులూ, గుఱ్ఱాలూ మొదలైన వాహనాలనూ, ధనాన్నీ కోరడు. ఎందుకంటే అవన్నీ ప్రాయంలో బాగానే ఉంటాయి. ముసలితనం వచ్చినప్పుడు అవే ముప్పుతిప్పలు పెడతాయి. శరీరం పోయిన తరువాత కాలుడు ఈ పాపానికి శిక్షగా సహింపనలవికాని సమ్మెట పోటులతో సత్కరిస్తాడు. ఆ శిక్షను పొందకుండా శ్రీమహావిష్ణువునకు అంకితంగా సమస్త జగత్తుకూ మేలుకలిగే విధంగా భాగవతాన్ని ఈ బమ్మెరపోతరాజు "ఒక్కడు" చెబుతున్నాడు.

 

ప్రతిపదార్ధము

ఈ = ఈ; మనుజ = మానువులు; ఈశ్వర = ఈశ్వరుడు - రాజు; అధముల = చెడ్డవారి; కున్ = కి; ఇచ్చి = ఇచ్చి; పురంబులు = ఊళ్ళు; వాహనంబులున్ = వాహనాలు; సొమ్ములున్ = ధనం; కొన్ని = మొదలైన కొన్ని; పుచ్చుకొని = తీసుకొని; సొచొక్కి = అలసిపోయి; శరీరము = శరీరము; సి = వదలి; కాలు = యముడి; చేన్ = చేత; సమ్మెట = సుత్తి; వ్రేటులన్ = దెబ్బలు; పడక = తినకుండ; సమ్మతి = ఇష్ట; తోన్ = తోటి; శ్రీహరి = విష్ణువున; కిన్ = కు; ఇచ్చి = ఇచ్ఛి; చెప్పెన్ = చెప్పెను; ఈ = ఈ; బమ్మెర = బమ్మెర; పోతరాజు = పోతరాజు; ఒకఁడు = అన బడేవాడు ఒకడు; భాగవతంబున్ = భాగవతమును; జగత్ = లోకానికి; హితంబుగన్ = ప్రియము కలుగు నట్లుగా.